ఇటీవల కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు తాము నటించిన సినిమాలను ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తూ అక్కడ స్టార్ హీరోలుగా హవా నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు తమిళ హీరోలు కూడా అదే బాటలో నడుస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది తమిళ హీరోలు అటు తమిళ మార్కెట్ తో పాటు తెలుగు మార్కెట్ పై కూడా దృష్టి పెట్టి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా సూపర్ హిట్ సాదిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇప్పటికే తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ స్టార్ హీరో ధనుష్ ఇక ఇటీవల మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సార్ అనే బైలింగ్వల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్గా నటించింది.


   తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.18 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే 5.5 కోట్ల షేర్ రాబట్టాలి.. అయితే రెండు రోజులకే ఈ సినిమా 8.71 కోట్లు రాబట్టి ఇక ప్రాఫిట్ లోనే ఉంది అని చెప్పాలి. అయితే తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా తెలుగులో హిట్ అయితే అటు తమిళంలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ రావడానికి చాలా దూరంలోనే ఉంది అన్నది తెలుస్తుంది. తమిళ్లో సార్ సినిమాకు 18.2 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే అక్కడ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసరికి 9.5 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. దీన్ని బట్టి ధనుష్ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఎంతో దూరంగా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: