కన్నడ భామ శ్రీలీల టాలీవుడ్ లో పాగా వేస్తుంది. మొదటి సినిమా పెళ్లిసందడి ఒక మోస్తారుగా హిట్ అయినా సరే అమ్మడికి రవితేజ ధమాకా రూపంలో లక్కీ ఆఫర్ వచ్చింది. ఇక ఆ సినిమాలో అమ్మడి టాలెంట్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ధమాకా సెట్స్ మీద ఉండగానే ఛాన్స్ లు రాగా ధమాకా సూపర్ హిట్ అవడంలో ఆమె పాత్ర ఎక్కువ ఉందని తెలిసి దాదాపు అరడజను దాకా ఛాన్స్ లు వచ్చాయి. ముఖ్యంగా ఒకే సంస్థ నుంచి దాదాపు 3 సినిమాల ఆఫర్ రావడం హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ శ్రీలీలకు వరుస వెంట ఛాన్స్ లు ఇస్తున్న బ్యానర్ ఏది అంటే సితార ఎంటర్టైన్ మెంట్స్ అని తెలుస్తుంది.

సితార బ్యానర్ లో సినిమా అంటే దాదాపు హిట్ సినిమా అన్నట్టే లెక్క. ఓ పక్క హారిక హాసిని బ్యానర్ లో పెద్ద సినిమాలు చేస్తూ సితారలో మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ సినిమాలు సితార బ్యానర్ లో చేయడం ఎందుకు అంటే వాటికి త్రివిక్రం భాగస్వామ్యం అవుతుండటమే అని తెలుస్తుంది. సితార బ్యానర్ లో ఇప్పటికే మొదలైన వినోదయ సీతం రీమేక్ లో శ్రీలీల ఉంటుందని చెప్పగా ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. అయితే వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న సినిమాలో శ్రీలీల నటిస్తుండగా మరోపక్క సితార చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీలీలని తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇదే కాదు మరో రెండు ప్రాజెక్ట్ లలో కూడా సితార బ్యానర్ శ్రీలీలనే ఫిక్స్ చేసినట్టు టాక్. అందులో విజయ్ దేవరకొండ సినిమా కూడ ఉందని తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గౌతం తిన్ననూరి చేస్తున్న సినిమాలో కూడా శ్రీలీల ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సో మొత్తానికి శ్రీలీల తెలుగులో వరుస ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతుంది. సితార బ్యానర్ లో 3, 4 సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: