దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ప్రస్తుతం అందరి దృష్టి ‘పుష్ప 2’ ‘సలార్’ మూవీల పై ఉంది. ఈ రెండు మూవీలు ఘనవిజయం సాధించడమే కాకుండా ఈ రెండు 1000 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకుంటాయని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ‘పుష్ప 2’ షూటింగ్ ఈమధ్యనే 10 రోజుల పాటు విశాఖపట్నంలో జరిగింది.ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటపడింది. ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఈమూవీలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుంది అన్నవిషయానికి సంబంధించి కానీ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి కానీ ఎటువంటి లీకులు రాకుండా సుకుమార్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనితో ఈమూవీలోని బన్నీ లుక్ గురించి అందరిలోనూ ఆశక్తి బాగా పెరిగిపోయింది.ఇప్పుడు సుకుమార్ ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రియల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆరోజున ఈ గ్లింప్స్ విడుదల చేస్తే దేశవ్యాప్తంగా అది ట్రెండింగ్ గా మారుతుంది అన్న అంచనాలతో సుకుమార్ ఈమూవీ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదలకు అన్నివిధాలా అనువైన తేదీగా ఏప్రియల్ 8ని ఎంచుకున్నట్లు టాక్. ఈమూవీ కథ రీత్యా అల్లు అర్జున్ పార్ట్ 2లో అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగి జపాన్ దేశంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకుని అక్కడి నుండి తెలుగు రాష్ట్రాలలో జరిగే గంధపుచెక్కల స్మగ్లింగ్ డాన్ గా మారుతాడని అంటున్నారు.

తెలుస్తున్న సమాచారంమేరకు ‘పుష్ప 2’ లో రష్మిక పాత్ర చాల చిన్నదిగా ఉంటుందని ఈమూవీలో బన్నీ పక్కన మరొక బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నటిస్తుంది అని అంటున్నారు. ఈసినిమాలోని సంభాషణలు అదేవిధంగా పాటలు ఏవిషయంలోనూ ‘పుష్ప’ స్థాయికి మించి ఉండే విధంగా చూసుకోవడానికి సుకుమార్ ఈసినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: