‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో తెలుగు సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి రాజమౌళి తీసుకువెళ్ళిపోయాడు. మొన్నటివరకు టాప్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఆలోచనలు చేస్తే ఇప్పుడు వారి ఆలోచనలు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయాయి. ఆస్కార్ అవార్డుల రేసులో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తుందో రాదో తెలియనప్పటికీ తెలుగుసినిమా పబ్లిసీటీ ఖర్చును పెంచిన వ్యక్తిగా రాజమౌళి మరొక రికార్డు క్రియేట్ చేసాడు.ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఆస్కార్ అవార్డుల స్థాయికి తీసుకువెళ్ళి అక్కడ హాలీవుడ్ మీడియాలో ఈమూవీ గురించి చాలగొప్పగా వ్యాసాలు వ్రాయించడానికి జక్కన్న కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా అక్కడ ఉండే హాలీవుడ్ విమర్శకులకు మీడియాకు భారీస్థాయిలో అత్యంత ఖరీదైన పార్టీలు కూడ ఇవ్వవలసి వచ్చింది అంటారు. అంతేకాదు ఈసినిమాను హాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి జక్కన్న సుమారు రెండు నెలల నుండి తరుచూ అమెరికా వెళ్ళడమే కాకుండా అక్కడ విలాసవంతమైన హోటల్స్ లో తాను ఉండటమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను కూడ అమెరికాకు రెండు మూడు సార్లు తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఆఖర్చు కూడ కోట్లాది రూపాయలలో జరిగి ఉంటుంది అన్నఅంచనాలు ఉన్నాయి.ఇప్పుడు అనుకున్న విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డు వస్తే దాని ప్రభావం వచ్చే సంవత్సరం విడుదల అయ్యే ‘పుష్ప 2’ పై ఉండవచ్చు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ చరణ్ జూనియర్ ల స్ఫూర్తితో తన ‘పుష్ప 2’ మూవీని పాన్ వరల్డ్ మూవీగా అమెరికాలో కూడ ప్రమోట్ చేసుకుని తన సినిమాకు కూడ ఆస్కార్ అవార్డు కాకపోయినప్పటికీ అమెరికాలో ఉండే అనేక సినిమా క్రిటిక్స్ ఇచ్చే అవార్డులలో ఏదో ఒక అవార్డు ‘పుష్ప 2’ వచ్చే విధంగా ప్లాన్ చేయాలని ఇప్పటి నుండే బన్నీ నుంచి ఆమూవీ నిర్మాతల పై ఆస్కారం ఉంది అంటూ అంచనాలు వస్తున్నాయి.అదే జరిగితే ప్రభాస్ మహేష్ లకు సంబంధించిన భారీ సినిమాలు కూడ హాలీవుడ్ మార్కెట్ పైన మాత్రమే కాకుండా హాలీవుడ్ పబ్లిసిటీ గురించి శ్రద్ధ పట్టే ఆస్కారం ఉండటంతో ఇక రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాలకు హాలీవుడ్ పబ్లిసిటీ కూడ ఒక ప్రధాన అంశంగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: