ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ ఈ మధ్య కాలంలో అశోక వనంలో అర్జున కళ్యాణం ... ఓరి దేవుడా వంటి మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ యువ హీరో ప్రస్తుతం దమ్కి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే విశ్వక్ ... నివేత కలిసి పాగల్ సినిమాలో నటించారు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. మరోసారి వీరిద్దరి జంటలో దమ్కి మూవీ రాబోతుంది. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ యుద్ధ పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించంది.  

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ఈ మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక స్టార్ హీరోను తీసుకురావాలి అని ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ... అందులో భాగంగా ఒక స్టార్ హీరోతో ఇప్పటికే ఈ సినిమా బృందం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: