సినిమాల పై విపరీతమైన మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ కు గాడ్ ఫాదర్ లేరు. అయినప్పటికీ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అదేవిధంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈయంగ్ హీరో చాల త్వరగా యూత్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఒక స్థాయిలో ఇతడు విజయ్ దేవరకొండకు పోటీ అవుతాడా అన్నసందేహాలు కూడ వచ్చాయి.


ఇతడు తీసిన ‘ఫలక్ నుమా దాస్’ విజవంతం కావడంతో అతడి పై అంచనాలు పెరిగాయి. అయితే ఆమూవీ తరువాత విడుదలైన అతడి సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ అతడి కెరియర్ కు చిన్న గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా అతడు నటించిన ‘ధమ్కీ’ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈమూవీకి అతడే స్వీయ దర్శకత్వం చేసుకుంటే అతడి నిర్మాతగా వ్యవహరించాడు.


అయితే ఈ మూవీ కథకు క్రితం సంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘ధమాకా’ మూవీ కథకు పోలికలు ఉండటంతో ఈమూవీ కథలో చాల మార్పులు చేసారు. ఇప్పుడు ఈ రీషూట్ అంతా పూర్తి కావడంతో రాబోతున్న ‘ఉగాది’ రోజున ఈమూవీని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈవార్తలే నిజం అయితే ఆస్కార్ అవార్డుల ఈవెంట్ తరువాత తారక్ పాల్గొనే మొట్టమొదటి పబ్లిక్ ఈవెంట్ ఇది కాబోతోంది. దీనితో అభిమానుల తాకిడితో పాటు మీడియా కవరేజ్ కూడ ఈ ఫంక్షన్ కు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. దీనితో ఈమూవీకి పరోక్షంగా జూనియర్ ఇమేజ్ సహకరించే ఆస్కారం ఉంది. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమైపోతున్న విశ్వక్ సేన్ కోరుకున్న హిట్ ఈమూవీ ఇవ్వగలిగితే రెట్టించిన ఉత్సాహంతో ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలు చేసి యూత్ కు దగ్గర అయ్యే ఆస్కారం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: