రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఏ రేంజ్ లో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు వారంతా గర్వంతో ఉప్పొంగిపోతున్నారు భారతీయులంతా కూడా మొదటి పూర్తిస్థాయి ఇండియన్ సినిమాకి అవార్డు రావడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ నేపథ్యంలోని ఈ పాటకు తమదైన శైలిలో ట్రిబ్యుట్స్ ఇస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పలు దేశాల అంబాసిడర్లు కూడా రోడ్ ఎక్కి మరి చెప్పులు వేయడం మొదలుపెట్టారు . అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే తెలుగు సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని అధ్యాయంగా నిలిచిందని చెప్పాలి. దీంతో చాలా మంది తమకు తోచిన విధంగా సినిమా యూనిట్ కి టీం కి ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో పాపి యోనా పార్కులో టెస్లా కార్ల లైట్స్ షో నిర్వహించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ముఖ్యంగా 150 టెస్లా కార్లు ఈ అరుదైన నాటు నాటు ట్రిబ్యూట్ ఫీట్ లో పాల్గొనడం గమనార్హం.

ఈ కార్లు అన్నింటిని ఆర్ఆర్ఆర్ షేప్ లో పార్కు చేసి నాటు నాటు పాటకు పాటలోని ట్యూన్స్ కి తగ్గినట్లుగా లైట్ షో నిర్వహించడం అందరినీ ఆకర్షించింది.. ఇకపోతే ఒక సినిమాకు  ఇటువంటి లైట్ షో నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని నిర్వహకులు కూడా చెబుతున్నారు. ఇకపోతే ఈ లైట్ షో చూడడానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాదు దాదాపు 500 మంది ఔత్సాహికులు కూడా హాజరవడం జరిగింది. మొత్తానికైతే తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుండడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: