
ఇకపోతే తెలుగు సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని అధ్యాయంగా నిలిచిందని చెప్పాలి. దీంతో చాలా మంది తమకు తోచిన విధంగా సినిమా యూనిట్ కి టీం కి ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో పాపి యోనా పార్కులో టెస్లా కార్ల లైట్స్ షో నిర్వహించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ముఖ్యంగా 150 టెస్లా కార్లు ఈ అరుదైన నాటు నాటు ట్రిబ్యూట్ ఫీట్ లో పాల్గొనడం గమనార్హం.
ఈ కార్లు అన్నింటిని ఆర్ఆర్ఆర్ షేప్ లో పార్కు చేసి నాటు నాటు పాటకు పాటలోని ట్యూన్స్ కి తగ్గినట్లుగా లైట్ షో నిర్వహించడం అందరినీ ఆకర్షించింది.. ఇకపోతే ఒక సినిమాకు ఇటువంటి లైట్ షో నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని నిర్వహకులు కూడా చెబుతున్నారు. ఇకపోతే ఈ లైట్ షో చూడడానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాదు దాదాపు 500 మంది ఔత్సాహికులు కూడా హాజరవడం జరిగింది. మొత్తానికైతే తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుండడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి.