టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. ఈ హీరో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక విజయవంతమైన మూవీ లతో ప్రేక్షకులను అలరించిన ఈ యువ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 

తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నిన్న అనగా మార్చి 22 వ  తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

 అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్ లను రాబట్టింది. అందులో భాగంగా ఈ మూవీ.కి మొదటి రోజు "యూ ఎస్ ఏ" లో కూడా సూపర్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు "యూ ఎస్ ఏ" లో 150 కే ప్లస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. "యూ ఎస్ ఏ" లో విశ్వక్ కు ఇదే కెరియర్ బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ లుగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీగా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: