ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజాయలను సాధిస్తూ ఉంటాయి. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులకు అద్భుతమైన గుర్తింపు లభించడం మాత్రమే కాకుండా ... ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడి కి కూడా సూపర్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. 

అలాగే ఆ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా భారీ లాభాలు దక్కుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ... అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన సినిమాలలో బలగం సినిమా ఒకటి. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ లోని నటన కు గాను ప్రియదర్శి కి ... కావ్య కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకులు నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపటి నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: