డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు డాన్స్ మాస్టర్ గా వ్యవహరించి అద్భుతమైన కొరియో గ్రాఫర్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించి నటుడిగా కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. లారెన్స్ ఇప్పటికే ఎన్నో తమిళ మరియు తెలుగు మూవీ లలో నటించిన నటుడి గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే లారెన్స్ కేవలం సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేయడం ... సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. 

అందులో భాగంగా లారెన్స్ ఇప్పటికే కొన్ని తెలుగు మూవీ లకు కూడా దర్శకత్వం వహించాడు. లారెన్స్ దర్శకత్వం వహించిన కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా లారెన్స్ "రుద్రుడు" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న లారెన్స్ "రుద్రుడు" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: