సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ఈ మూవీ లో పూజ హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించనున్నారు.

ఇది వరకే పూజా హెగ్డే ... మహేష్ సరసన మహర్షి అనే మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ... మహేష్ తో నటిస్తున్న మొట్ట మొదటి సినిమా ఇదే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో ఫైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ... మహేష్ ఈ మూవీ లో తండ్రి పాత్ర లోనూ ... కొడుకు పాత్ర లోను కనిపించ బోతున్నట్లు ఈ మూవీ లో తండ్రి పాత్రలో కనిపించబోయే మహేష్ గెటప్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... అలాగే తండ్రి పాత్రలో వచ్చే సన్నివేశాలు కూడా సూపర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది వరకు రూపొందిన అతడు ... ఖలేజా మూవీ లు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: