ఈ వేసవి కాలంలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా తెలుగు సినిమాలు విడుదలై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.. సమ్మర్ లో విడుదలయ్య సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ జోనర్ లోనే విడుదల కాబోతున్నాయి. అలా విడుదల కాబోతున్న చిత్రాలలో నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా IMDB అందించిన సమాచారం ప్రకారం మోస్ట్ యాంటిసిపెటేడ్ మూవీగా ఇండియన్ ఫిలిం ఆఫ్ ది సమ్మర్లో టాప్ టెన్ లో నిలిచింది.


బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ చత్రపతి మే 12న విడుదల కాబోతోంది.ఈ సినిమా IMDB జాబితాలో ఐదవ స్థానం నిలవగా తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇక తెలుగు తమిళ భాషలలో వస్తున్న కస్టడీ సినిమాని డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోని 22వ సినిమాగా తెరకెక్కించడం జరుగుతొంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పలు వీడియోలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
కస్టడీ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. మేకర్స్ ఇప్పటికీ విడుదల చేసిన కస్టడీ ఫ్రీలు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలని పెంచేస్తున్నాయి. ఇందులో విలన్ గా అలనాటి హీరో అరవిందస్వామి నటిస్తున్నారు. అలాగే ఇతర పాత్రలలో వెన్నెల కిషోర్, శరత్ కుమార్, సంపత్ రాజ్ ,ప్రియమణి నటిస్తూ ఉన్నారు. మ్యూజిక్ ని ఇళయరాజా అందిస్తూ ఉండగా యువన్ శంకర్రాజ కస్టడీకి సంగీతాన్ని అందిస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య కస్టడీ సినిమాతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: