టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. ఈ దర్శకుడు అతనొక్కడే మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ స్టైలిష్ దర్శకుడు ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో గా నటించగా ... సాక్షా వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. హిప్ హాప్  తమిజ సంగీతం అందించిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరమూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరుస ప్రమోషన్ లను నిర్వహిస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు వరంగల్ లో ఈ చిత్ర బృందం నిర్వహించ బోతోంది. ఈ మూవీ ప్రీ ఈవెంట్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరో భారీ ఈవెంట్ ను కూడా ఈ చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత తదుపరి చేయబోయే భారీ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: