అక్కినేని అఖిల్ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించాడు. హిప్ హాప్ తమిజ సంగీతం అందించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.

 ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యొక్క టికెట్ లను బుక్ మై షో లో పెట్టారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టికెట్ లకు బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే బుక్ మై షో యాప్ లో ఈ మూవీ కి ఆడియెన్స్ లక్ష కి పైగా మంది ఇంట్రెస్ట్స్ చూపించారు.

 ఇలా ఈ మూవీ కి బుక్ మై షో అప్ లో ఫుల్ క్రేజ్ లభిస్తుంది. విడుదలకు సిద్ధం అయినా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు ఈ చిత్ర బృందం వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ ఈవెంట్ తో పాటు ఈ చిత్ర బృందం మరో ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ... ఆ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: