అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

 అందులో భాగంగా అక్కినేని నాగార్జునమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే వారు కొత్త జోనర్ లో వచ్చిన మూవీ లను ఆదరించి వాటిని బ్లాక్ బాస్టర్ లుగా మార్చారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి మరియు అఖిల్ కలిసి ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త స్పై జోనర్ లో ఏజెంట్ మూవీ ని ప్రయత్నించారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను అని నాగార్జున తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఏజెంట్ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: