తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి పాయల్ ర
రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కార్తికేయ హీరో గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందినటు వంటి ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో పయల్ తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో పాయల్ కు ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.

ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత పాయల్ అనేక మూవీ లలో అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాయల్ ... అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

 ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి పాయల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ వెనకాల నుండి ఉన్న ఫోటోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫోటోలో పాయల్ ఏ మాత్రం బట్టలు లేకుండా హాట్ లుక్ లో ఉంది. ప్రస్తుతం పాయలు కు సంబంధించిన మంగళవారం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: