
పృథ్వీరాజ్ అనారోగ్యానికి గల కారణం ఏంటని విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా ఒక వీడియోని మాత్రం విడుదల చేయడం జరిగింది పృథ్వీరాజ్.. మొదటిసారి తన తీయబోతున్న కొత్త రంగుల ప్రపంచం సినిమాకి ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని తెలియజేస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ చేయబోతున్నామంటూ సెలైన్ తో ఉన్న ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నానంటూ తెలియజేస్తున్నారు పృథ్విరాజ్. అయితే తన అనారోగ్యానికి కారణమేంటో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు తీవ్ర అలసట వల్లే ఈయన ఆసుపత్రి పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నో చిత్రాలలో విలన్ గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా పృథ్వీరాజ్ టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక డైలాగ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నారు. వైసిపి పార్టీ తరఫున ఎస్వీబీసీ చైర్మన్గా విధులు నిర్వహించిన ఈయన కొన్ని కారణాల చేత ఆ పార్టీ నుంచి తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం తన కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని తన కూతురు ఇటీవల తెలియజేయడం జరిగింది. పృధ్విరాజ్ ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.