ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బీమ్ల నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. పవన్ ... రానా హీరోలుగా రూపొందిన ఈ సినిమాలో సంయుక్త ... రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. 

మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ నటి ఈ సంవత్సరం సార్ మరియు విరూపాక్ష మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇప్పటి వరకు నటించిన నాలుగు మూవీ ల్లో నటిస్తే నాలుగు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో సంయుక్త ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా సంయుక్త తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: