ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ ప్రజలకు తెలిసిన నటి. ఈమె సీనియర్ నటుడు రాజేష్ కూతురు.  ఒక సందర్భంలో తెలుగులో కంటే తమిళంలోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తెలుగు అమ్మాయిని అయినప్పటికీ ఇక్కడ అవకాశాలు లేవని బహిరంగంగానే మాట్లాడింది. అయితే ఈ మధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ నేను చేసుంటే బాగా చేసేదాన్ని అని  మాట్లాడారు. దీని పైన సోషల్ మీడియాలో రష్మిక అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆమె అన్న వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని ఐశ్వర్య రాజేష్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఆమె రష్మిక కంటే బాగా చేస్తా అని అనలేదు.  నేను చేసి ఉంటే బాగా చేసేదాన్ని నాకు ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేది అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ దీన్ని నెగెటివ్ గా తీసుకున్నారు. రష్మిక అభిమానులు తీవ్రంగా ఆమెని ట్రోలింగ్ చేస్తున్నారు. నేను చెప్పింది ఒకటి మీరు అర్థం చేసుకుంది మరోటి. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కేవలం పుష్ప లో ఆ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుందని అన్నాను.  అని  వివరణ ఇచ్చింది. కానీ అభిమానులు ఇలా ట్రోల్ చేస్తారని అనుకోలేనని తెలిపింది.  


దీనికి రష్మిక కూడా స్పందిస్తూ ఐ లవ్ యు ఐశ్వర్య ఇలాంటివి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ సినిమా ప్రమోషన్స్ లో మీ సినిమాలపై దృష్టి పెట్టు  రాబోయే సినిమాలో మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని ఆమెకు విషెస్ చెప్పింది. రష్మిక స్పందించిన తీరుపై చాలామంది అభినందనలు తెలుపుతున్నారు. హుందాగా స్పందించడం కూడా హీరోయిన్లకు అవసరమని ఇలాంటి స్పందన రష్మిక గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఎక్కువ మంది పొగుడుతున్నారు ఏదేమైనా  ఐశ్వర్య  చేసిన వ్యాఖ్యలు కించపరిచేవి కాకున్నా ఆమె వివాదంలో ఇరుక్కోవడం రష్మిక వచ్చి గొడవ సద్దుమణిగేలా చేయడం జరిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: