టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట జీరో సైజ్ నడుముతో కుర్రకారులను తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కూడా స్టార్ స్టేటస్ ను అందుకుంది.. తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఇలియానా ఆ తర్వాత స్టార్ క్రేజ్ అందుకున్నాక బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవాలనుకుంది.కానీ బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అన్ని ప్రాధాన్యత లేని పాత్రలు కావడం చేత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఇలియానా.


దీంతో ఇలియానాను బాలీవుడ్ లో ఎవరు పెద్దగా పాటించుకోలేదు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో విదేశీ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడి బాగా చెట్ట పట్టాలేసుకొని తిరిగేది. ఏమైందో తెలియదు కానీ కొన్నేళ్ళకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో ఈ బ్రేకప్ వల్ల ఇలియానా చాలా డిప్రెషన్కు గురై సినిమాలకు దూరంగా ఉండేది. గడిచిన రెండేళ్ల క్రితం ఇలియానా మళ్లీ సినిమాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలోనే మళ్లీ ఇలియానా గర్భవతి అనే విషయాన్ని తెలియజేసి అందరికి అవాక్కయ్యేలా చేసింది.


అయితే ఇదంతా కేవలం సినిమా కోసమే అని అనుకున్నారు. కానీ ఇలియానా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడంతో  ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నమ్మారు.. దీంతో ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  తాజగా తనకు ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఒక డైమండ్ రింగ్ పెట్టుకొని ఫేస్ రిలీవ్ చేయకుండా తనకు పుట్టబోయే బిడ్డ ఫ్యాన్స్ ఫోటోలతో క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఈ ఫోటోకు క్లారిటీ ఇస్తూ నా రొమాంటిక్ ఐడియాతో ప్రశాంతంగా అతనిని తినివ్వలేదు అంటూ తెలియజేసింది. గతంలో ఇలియానా, కత్రినా కైఫ్ సోదరుడుతో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. మరి ఆమె బిడ్డకు తండ్రి అతడే అయ్యుండొచ్చు అని పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: