
దీంతో ఇలియానాను బాలీవుడ్ లో ఎవరు పెద్దగా పాటించుకోలేదు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో విదేశీ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడి బాగా చెట్ట పట్టాలేసుకొని తిరిగేది. ఏమైందో తెలియదు కానీ కొన్నేళ్ళకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో ఈ బ్రేకప్ వల్ల ఇలియానా చాలా డిప్రెషన్‌కు గురై సినిమాలకు దూరంగా ఉండేది. గడిచిన రెండేళ్ల క్రితం ఇలియానా మళ్లీ సినిమాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలోనే మళ్లీ ఇలియానా గర్భవతి అనే విషయాన్ని తెలియజేసి అందరికి అవాక్కయ్యేలా చేసింది.
అయితే ఇదంతా కేవలం సినిమా కోసమే అని అనుకున్నారు. కానీ ఇలియానా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడంతో ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నమ్మారు.. దీంతో ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాజగా తనకు ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఒక డైమండ్ రింగ్ పెట్టుకొని ఫేస్ రిలీవ్ చేయకుండా తనకు పుట్టబోయే బిడ్డ ఫ్యాన్స్ ఫోటోలతో క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఈ ఫోటోకు క్లారిటీ ఇస్తూ నా రొమాంటిక్ ఐడియాతో ప్రశాంతంగా అతనిని తినివ్వలేదు అంటూ తెలియజేసింది. గతంలో ఇలియానా, కత్రినా కైఫ్ సోదరుడుతో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. మరి ఆమె బిడ్డకు తండ్రి అతడే అయ్యుండొచ్చు అని పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు.