మన హృదయంలోకి మనమే చొచ్చుకుని వెళ్ళిపోయి అప్పటి వరకు మనలో నిద్రపోతున్న శక్తిని వెలికి తీయడమే అథెంటిసిటీ. నమ్మిన విషయాన్ని బయటకు నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తులు అథెంటిసిటీ ఎక్కువగా ఉన్నవారిగా గుర్తింపు పొందుతారు. అంతేకాదు ఇతరులకన్నా చాల భిన్నంగా ఆలోచిస్తూ తాను నమ్మిన విషయం కోసం చివరి వరకు పోరాటం చేయగల వ్యక్తులను ఈ అథెంటిసిటీ ఎక్కువగా ఉన్న వ్యక్తుల కోవలో చేరుస్తారు.


మనసులో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ పైకి మాత్రం మరోలా బ్రతుకుతున్నట్లు నటించే వ్యక్తులు జీవితంలో వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనవంతులు కాలేరు. అంతేకాదు ఏవ్యక్తి అయితే తనను తాను ప్రేమించుకుని అదేవిధంగా తనను తాను గౌరవించుకుని తన విలువలను నమ్ముతూ బ్రతుకుతారో వారందరికీ ఈ అథెంటిసిటీ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఈ అథెంటిసిటీ కలిగిన వ్యక్తులు ఎక్కువ సమయం పుస్తకాలు తోటపని మ్యూజిక్ ప్రార్థనా కుట్లు అల్లికలతో కాలం గడుపుతూ ఉంటారు.


ఇలా గడిపే వ్యక్తులు అందరికీ తాము తమలా బ్రతకగలం అన్న నమ్మకం కలిగి తాము జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యాల పై ఎటువంటి రాజీ లేకుండా పోరాటం చేస్తూ తమను విమర్శించే అవకాసం కానీ అదేవిధంగా కంట్రోల్ చేసే అవకాశం ఎదుటి వ్యక్తులకు ఇవ్వరు. నిజమైన విజయం ఎప్పుడు ఎదురు దెబ్బలు తినకుండా వ్యక్తికి రాదు. ప్రపంచంలో అందరు మన గురించే ఆలోచిస్తున్నారు అంతా మనవైపే చూస్తున్నారు అని ఆలోచించే వ్యక్తి ధనవంతుడు కాలేడు.


పరిస్థితులలో రాజీపడటం మనలను మనం ద్వేషించుకోవడం మనలను చూసి మనమే సిగ్గు పడటం లాంటి లక్షణాలు కలిగిన ఏవ్యక్తి ఎంత సమర్ధుడు అయినా విజయాన్ని అందుకోలేడు. జీవితంలో ఒక భాగం అయిన ఉద్యోగం వ్యాపారాలలో గెలుపు ఓటమి లు అన్నీ కూడ మనలను మనం చూసుకునే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. ఎంతసేపు మన లోపాల పైనే కాకుండా మన సామర్థ్యం పై దృష్టి నిలిపి విభిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నాలు చేయడమే అథెంటిసిటీ. దీనితోనే సంపద వస్తుంది అన్నవిషయం అనేక ఉదాహరణలు తెలియచేస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: