రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం దేశంలో ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతోందని కొంతమంది ఋణ గ్రహీతలు ఋణం చెల్లించే శక్తి ఉన్నా ఈ మారిటోరియం వంకతో ఈ వసతిని దుర్వినియోగం చేస్తున్నారని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. అయితే ఇప్పట్లో ఆదాయం మేరుగుపరుచుకోలేని పెద్ద కార్పోరేట్ కంపెనీలకు రిటైల్ ఋణ గ్రహీతలకు ప్రస్తుతం కరోనా పరిస్థితులు వల్ల ఋణాలు చెల్లించే అవకాశం ఉండదు కాబట్టి ఋణాల నిర్దిష్ట గడువును పునర్వ్యవస్థీకరించి ఋణ చెల్లింపుల గడువును గరిష్టంగా రెండు సంవత్సరాల పాటు పొడిగించాలనే ఆలోచన కూడ రిజర్వ్ బ్యాంక్ చేస్తోందని అంటున్నారు.
అయితే ఈ ఋణ పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని బట్టి అర్హులు అయినవారికి మాత్రమే మేసులుబాటు కలిగించాలని బ్యాంక్ లను నిర్దేశిస్తూ కొన్ని సూచనలను కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఒకవైపు ఋణాల మారిటోరియం లేదు అని చెపుతూనే మరొక వైపు కొన్ని బడా కార్పోరేట్ సంస్థలకు లాభం కలిగే విధంగా కొత్త విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉంటాయా అన్న సందేహాలు వస్తున్నాయి.
ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగుల విషయంలో ఈ కరోనా పరిస్థితుల మధ్య జీతాల పై కోతలు విధిస్తున్న పరిస్థితులలో సామాన్యుడు ఇలాంటి పరిస్థితులను ఎదిరించి నిలబడాలి అంటే ఋణాల కు సంబంధించిన మారిటోరియంను మరికొంత కాలం కొనసాగించమని ప్రభుత్వాలకు అభ్యర్ధనలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితులలో ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి