దసరా పండుగ ముగిసి పోవడంతో ఇక కంపెనీల దృష్టి అంతా వచ్చే నెలలో రాబోతున్న దీపావళి పై పడింది. ఇప్పటి నుంచే తమ వస్తువులకు సంబంధించిన దీపావళి స్కీమ్ లను కంపెనీలు అనౌన్స్ చేస్తూ ముగిసిన దసరా ట్రెండ్ ను కొనసాగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆరు నెలలుగా కొనసాగిన కోవిడ్ 19 సంక్షోభంతో ఉద్యోగుల వెతనాలలో కోతలు పడటం ఉద్యోగుల తొలగింపు భారీ వర్షాలు ఇలాంటి కారణాలు వల్ల పండగ సీజన్ అమ్మకాలు ఎలా ఉంటాయో తెలియక ఇబ్బంది పడిన చాల కంపెనీలకు తమ ప్రొడక్ట్స్ విషయంలో జనం నుండి ఊహించని స్పందన రావడం ఈసీజన్ ప్రత్యేకత అని అంటున్నారు.


ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్ ఫ్లిప్ కార్డ్ లాంటి భారీసంస్థలు అనేక ప్రొడక్ట్స్ ను మార్కెట్ రేట్లకన్నా చాల తక్కువకు ఆఫర్ చేసినప్పటికీ నగలు ఖరీదైన చీరలు విలాస వంతమైన లేటెస్ట్ ఫ్రిజ్ లు భారీ స్క్రీన్స్ తో ఉండే టీవి లను ఈకామర్స్ పోర్టల్స్ లో కంటే బయట పెద్ద షాపులలో కొనడానికే జనం ఆశక్తి కనపరచారు. దీనికి కారణం ఈకామర్స్ లో ఆర్డరు కున్న వస్తువులు పండుగరోజున డెలివరీ చేయలేరు కాబట్టి తమ ఇంటికి ఖరీదైన వస్తువులు పండుగరోజు తెచ్చుకుంటే బాగుంటుంది అన్న సెంటిమెంట్ యజమానులను రక్షించింది అని అంటున్నారు.


చాలామంది ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నెలలు తరబడి ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితులలో మార్పుకోసం ఈ దసరా సీజన్ లో రిస్క్ చేసి చాలామంది బయటకు రావడమే కాకుండా తమకు నచ్చిన రకరకాల వస్తువులు మార్కెట్లో విపరీతంగా కొన్నారు. గత సీజన్ లో సెల్ ఫోన్ సగటు అమ్మకం 7వేల వరకు ఉంటే ప్రస్తుత వ్యతిరేక పరిస్థితులలో కూడ సెల్ ఫోన్ సగటు అమ్మకం 15వేల వరకు జరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


ముఖ్యంగా పిల్లలకు ఆన్ లైన్ తరగతులు కొనసాగుతూ ఉండటంతో పీసీలకు ల్యాప్ టాప్ లకు టాబ్లెట్ లకు విపరీతమైన గిరాకీ ఏర్పడి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. క్రెడిట్ రేటింగ్ లతో సమస్యలు ఏర్పడటంతో చాలామంది ఈసారి సీజన్ లో తమ సొంత డబ్బుతోనే వస్తువులు కొనడంతో చాలమంది వ్యాపారులు మరింత ఎక్కువగా డిస్కౌంట్లు ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడి ఇదే ట్రెండ్ రాబోతున్న దీపావళి కి ఉంటుందా లేదా అన్న కన్ఫ్యూజన్ పెద్ద వ్యాపారులకు ఏర్పడినట్లు తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: