ఇంట్లో ఉండి వ్యాపారం చేయాలని ఆలోచించే మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ బిజినెస్ ఏంటి? దీనిని ఎలా మొదలు పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ వల్ల నలుగురికి ఉపాధి కల్పించడమే కాదు మీరు ఆర్థికంగా మరింత ఉన్నత స్థానానికి చేరుతారు అని చెప్పవచ్చు. ఇకపోతే వ్యాపారం చేయాలి అంటే పెట్టుబడి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తున్నారా ఇకపై మీరు అలా డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి వస్తువులను తాకట్టు పెట్టకుండా లోన్ పొందవచ్చు. రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు మీరు రుణాలు పొందే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా బయట ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూసి.. ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద మీరు రుణం తీసుకున్నా సరే ఇంతకంటే చాలా ఎక్కువ మొత్తంలో మీరు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.. కాబట్టి ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్ పథకం ద్వారా లోన్ తీసుకొని లబ్ధి పొందవచ్చు.

పెట్టుబడి అందుకున్న తర్వాత ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఆన్లైన్ కేక్ బిజినెస్ ప్రారంభించడం ఒక మంచి ఆదాయం.. 365 రోజులపాటు ఎవరో ఒకరి బర్తడేలు, ఫంక్షన్లు ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి.. కాబట్టి ప్రతి ఒక్కదానికి కేక్ అనేది తప్పనిసరి గా మారిపోయింది. ముఖ్యంగా వెడ్డింగ్ యానివర్సరీ అయినా మరే ఫంక్షన్ అయినా సెలబ్రేషన్స్ అయినా సరే చాలామంది కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని బేకరీలో కాకుండా మీరు మీ ఇంటి వద్దనే కేకులను తయారు చేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను స్వీకరించి విక్రయించవచ్చు. లేదా స్విగ్గి,  జొమాటో వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న సరే మీకు మరింత ఆదాయం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: