క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ను ప్రకటించాడు పవర్ స్టార్. ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.ఇక ఈ సినిమాకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ డైరెక్టర్ బెన్‌లాక్ (వీఎఫ్ఎక్స్)విజువల్ ఎఫెక్ట్స్ అందించనున్నారు. ఈ మేరకు ఆయన గత వారమే ట్విటర్లో స్పందించారు. 'పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్రిష్, పవన్ కల్యాణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు.