RRR సినిమా చిత్రీకరణ అక్టోబర్ 5 సోమవారం నుంచి పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డి.వి.వి ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. 'విశ్రాంతి ద్వారా రీచార్జ్ అయ్యాం. ఇప్పుడు గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. రాజమౌళి మాట్లాడుతూ 'జీవితం కొత్తరకమైన సాధారణ స్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్ని అలవాటు చేసుకుంటూ జీవితాన్ని సాగించాలి. సుదీర్ఘమైన విరామం వల్ల సినిమాకు మంచే జరిగిందనుకుంటున్నా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని అందించాలని సిద్ధమయ్యాం' అన్నారు.