దసరా పండుగ అంతా అల్లు అర్జున్ కుటుంబంలోనే కనబడుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు తన భార్య, పిల్లలతో కలర్ ఫుల్‌గా ఉన్న ఫొటోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో బన్నీ పిల్లలు అయాన్, అర్హలు ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఏ పండుగ అయితే ఆ పండగ వేషధారణలో ఈ మధ్య అయాన్, అర్హలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈసారి పిల్లలతో కలిసి స్నేహ, అల్లు అర్జున్ కూడా దర్శనమివ్వడంతో మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. దసరా శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.