తాజాగా రామరాజు ఫర్ భీమ్ టీజర్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ సెన్సేషనల్ గా మారింది. ఇప్పటికే 23 మిలియన్ యూ ట్యూబ్ వ్యూస్ తో ఇంకా తన సత్తా చాటుతోంది.ఇక లైక్స్ పరంగా దాదాపు1.1 మిలియన్ లైక్స్ తో రామరాజు ఫర్ భీమ్ టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఒక మిలియన్ లైక్స్ అందుకున్న టీజర్ గా రామరాజు ఫర్ భీమ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డ్ నెలకొల్పింది.  ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు కూడా ఇన్ని లైక్స్ రాలేదు. రోజులు గడుస్తున్న కొద్ది లైక్స్ పెరుగుతూనే ఉండటం గమనార్హం.అయితే కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో సైతం ఈ వీడియో సంచలనం గా మారింది.