కాజల్ పెళ్లిలో ధరించిన లెహెంగాపై సంక్లిష్టమైన జర్డోసి ఎంబ్రాయిడరీ ఫ్లొరల్ ప్యాటర్న్‌ను డిజైన్ చేయడానికి దాదాపు 20 మంది సహాయంతో నెల రోజుల సమయం పట్టిందని అనామిక వెల్లడించారు. కాజల్ ధరించిన లెహంగాను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారని స్వయంగా కాజలే వెల్లడించినప్పటికీ.. ఆ డ్రెస్ ఖరీదు ఎంత అనే విషయంలోనే ఇంకా ఆమె స్పష్టత ఇవ్వలేదు.  అలాగే కాజల్ ధరించిన జువెల్లరీని సునీతా శేఖవత్ డిజైన్ చేశారు. కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లు ధరించిన తెలుపు రంగు షేర్వానీని డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. ఆ షేర్వానీ విలువ రూ. 1,15,000. అలాగే కాజల్ తన మెహెందీ ఫంక్షన్లో ధరించిన ఆకుపచ్చ రంగు కుర్తాని కూడా అనితా డోంగ్రే డిజైన్ చేశారు. ఆ డ్రెస్ విలువ రూ. 24,500 అని సమాచారం.