తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన'మిస్ ఇండియా'సినిమా నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కేజీఎఫ్' స్టార్ యష్ ఇందులో అతిధి పాత్ర పోషించాడని మీకు తెలుసా? కానీ, ఇది మీరు అనుకుంటున్నట్లుగా కాదు. యష్ మూవీ 'కేజీఎఫ్' పోస్టర్ ఒక సన్నివేశంలో ఇలా కనిపించి అలా మాయమవుతుంది. అయినప్పటికీ యష్ అభిమానులు దీనిని కనిపెట్టేశారు. ఆ ప్రత్యేకమైన స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నిమిషాల వ్యవధిలో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'మిస్ ఇండియా'లో ఒక సన్నివేశంలో మానస సంయుక్త (కీర్తి సురేశ్), ఆమె ఫ్రెండ్ విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) ఓ మాల్‌కు వెళ్తారు.అక్కడ ఓ క్లాత్ షోరూమ్‌లో కొత్త బ్లాక్ గౌన్ వేసుకుని, తన కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది సంయుక్త. అప్పుడు బ్యాగ్రౌండ్లో ఆ మాల్లోని థియేటర్ దగ్గర 'కేజీఎఫ్' పోస్టర్ కనిపిస్తుంది.