అజిత్ పుట్టిన రోజు స్పెషల్ గా మే 1న 'వలిమై' సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, ఇప్పుడు వాళ్ళకి కరోనా షాక్ ఇచ్చింది. దేశమంతా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని ఇప్పుడు ఫస్ట్ లుక్ వాయిదా వేశారని తెలుస్తోంది.