తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నయనతార మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్..వచ్చే రావడంతోనే సూపర్ స్టార్ సరసన నటించిన ఈ మళియాలి భామ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు నయనతార రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు భారీగానే ఉందట. అంతే కాదు ఈ ముదురు భామ యంగ్ హీరోయిన్లకు ధీటుగా నటిస్తూ హంగామా సృష్టిస్తుంది. ఇకపోతే ఈ అమ్మడి కెరీర్ లో ఎన్నో వివాదాల తో నడిచింది..వచ్చిన కొత్తలో హీరో శింబుతు పీకల్లోతుల్లో పడి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది.


శింబు , నయనతార


సోషల్ మీడియాలో సెలబ్రెటీ లిప్ లాక్ అంటే ఈ ఇద్దరి జంట లిప్ లాక్ సీన్లు దర్శనమిస్తాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు..తర్వాత డ్యాన్స్ మాస్టర్, దర్శకులు అయిన ప్రభుదేవతో పెళ్లదాక వచ్చాన వ్యవహారం ఒక్కసారిగా బెడిసి కొట్టింది. కొంత కాలం ప్రేమా దోమా లేదంటూ నయన్ తన కెరీర్ పై దృష్టి పెట్టింది. రీసెంట్ గా   ఈ అమ్మడు ‘ నాను రౌడీ దాన్‌’ చిత్ర దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి.

నయనతార, ప్రభుదేవ


అంతేకాదు వీరిద్దరికి సీక్రెట్‌ గా మ్యారేజ్‌ జరిగిందనే ప్రచారం జరిగింది.  ప్రస్తుతం విఘ్నేష్‌, నయన వ్యవహారం కూడా దాదాపు అలానే ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి. విఘ్నేష్‌, నయనను పెళ్లి చేసుకుందామని వారిస్తుంటే, ఈ అమ్మడు తన బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్ని రోజులు ఆగుదామని చెప్తుందట. ఈ విషయం వలనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని కోలివుడ్‌ టాక్ .



మరింత సమాచారం తెలుసుకోండి: