అక్కినేని నాగార్జున ఇంట మరో విషాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నాగార్జున బావ అనుమోలు సత్యభూషణ్ రావు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో భాధపడుతున్న సత్యభూషణ్ రావు ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడినట్టు అనిపించగా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారట. 


ఈరోజు తెల్లవారు జామున ఉన్నట్టుండి ఆయనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయట.. హాస్పిటల్ కు వెళ్లే టైం లోనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తుంటారు. సత్య భూషణ్, నాగ సుశీల తనయుడు సుశాంత్ హీరోగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. నిర్మాత ఏవి సుబ్బారావు రెండో తనయుడు సత్యభూషణ్ రావు. ఏవి సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిచర్స్ మీద ఎన్నో మంచి క్లాసిక్ సినిమాలు చేశారు.  


సత్య భూషణ్ రావు పెద్ద ఇండస్ట్రియలిస్ట్.. కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు నాగ్ కార్పోరేషన్ ద్వారా నాగ సుశీలను నిర్మాతగా పెట్టి సత్యభూషన్ గారే సినిమాలను నిర్మించారు. సిని పరిశ్రమతో మంచి అనుబంధం ఉండటంతో నాగార్జున బావ సత్యభూషణ్ మరణంతో సిని పరిశ్రమ షాక్ కు గురయ్యింది. ఇప్పటికే కొందరు ప్రముఖులు నాగార్జున కుటుంబానికి తమ నివాళులు అందించారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: