ఎంత టాప్ హీరోల సినిమాలకైనా కధ ముఖ్యం. కధ లేకుండా ఎంత భారీ తారాగణంతో భారీ సెటింగ్స్ వేసి సినిమాలు తీసినా ప్రేక్షకులు చూడరు. టాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోల సినిమాలు కధ లేకపోవడంతో ఘోర పరాజయాలుగా మారడం ఎన్నోసార్లు చూసాం. ఈ విషయాలన్నీ కూడా సినిమాలు తీసే నిర్మాతలకు, దర్శకులకు బాగా తెలుసు. అయినా అన్నీ తెలిసి పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఇటువంటి సంఘటనే ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ‘రభస’ సినిమా ఆగిపోవడానికి గల కారణం అని అంటున్నారు.  ఈసినిమాని నిర్మిస్తున్న బెల్లంకొండ సురేష్ గతంలో కూడా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు ఆర్భాటంగా ఒక చిత్రాన్ని ప్రారంభించి ఆ సినిమాకు హైటెక్స్‌లో అదిరిపోయేట్లు ఫంక్షన్‌ చేశాడు. ఆదిలోనే హంసపాదంలా అప్పటికే కథ సెట్‌ కాలేక పోయినా బాలయ్య డేట్స్‌ ఇచ్చాడని నానా హంగామా చేసారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు కథను సరైన దిశగా రూపొందించడంలో ఆనాడు బి.గోపాల్‌ విఫలమయ్యాడని ఆ ప్రాజెక్ట్ ను వదిలేసారు. ప్రస్తుతం అదే సీన్‌ మళ్ళీ రిపీట్‌ అయిందా అన్నటుగా ఎన్టీఆర్‌ ‘రభస’ చిత్రానికి జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'రభస' సినిమాను చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మధ్యలో కొన్ని అవాంతరాలతో ఆ చిత్రానికి 20 రోజులు గ్యాప్‌ ఇచ్చారు. ఈ గ్యాప్‌కూ ‘రామయ్యా వస్తావయ్యా’ ప్లాప్‌ కావడం సాకుగా చూపెడుతూ వార్తలు పుట్టించారు యూనిట్ సభ్యులు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కధ పూర్తిగా తయారుకాలేదనీ, సెకండాఫ్‌లో ఇంకా క్లారిటీ లేదని అందుకునే షూటింగ్ ను వాయిదా వేసారని అని అంటున్నారు. ఈ నెల 20 తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని వార్తలు వస్తున్నా అది ఖచ్చితమైన వార్తలు కావు అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఎదిఎమైన బాలయ్య ఆనవాయితి జూనియర్ ను వెంటాడుతున్నట్లే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: