గత మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాలో అందరి హీరోలతో నటించిన హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే పేరు కచ్చితంగా వినిపిస్తుంది. వరుణ్ తేజ్ సినిమా ముకుందా తో మనందరి ముందరికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం  సినిమా లో కూడా నటించింది. కానీ తన తొలి చిత్రాలతో అంతగా విజయాన్ని రుచి చూడలేదు. కానీ మరి ఈ అమ్మడి అందం తో అందర్నీ ఆకట్టుకుని పెద్ద హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. ఆ తరుణంలోనే అల్లు అర్జున్ సరసన డిజె సినిమాలో కనిపించింది. అలాగే ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా నటించింది.

 

 ఇక ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో నటించింది. మధ్యలో బాలీవుడ్ లో నటించిన మొహంజదారో సినిమా నిరాశపరిచిన ఈ సంవత్సరం హౌస్ ఫుల్ 4 సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి విజయం సాధించింది.

 

 ఎప్పటికప్పుడు ఘాటయిన ఫోటో షూట్లతో తన అందాలను ప్రదర్శించే పూజా హెగ్డేకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య ఈ అమ్మడు గ్యాప్ లేకుండా కొత్త కొత్త ఫోటో షూట్ లతో తన జోరుని చూపిస్తుంది. ఇప్పటి వరకూ చేసిన మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్ లు అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ హీరోయిన్ చేయలేదు. తాజాగా ప్రఖ్యాత వెడ్డింగ్ మ్యాగజిన్ డిజైనర్ వోస్ డిసెంబర్ కవర్ పేజీకి ఆమె ఫోజులు ఇచ్చారు. ఎథ్నిక్ డిజైనర్ వేర్.. మోడ్రన్ లెహెంగాలో తళుక్కున మెరిసింది. పూజా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ వెడ్డింగ్ డిజైన్ ఇది అనడంలో అతిశయోక్తి కాదు. ఇక్కడ చుస్తే ఆమెకి పెళ్లి కల వచ్చినట్లే కనిపిస్తుంది. 

 

 కెరియర్ పరంగా ఇప్పుడు పూజా హెగ్డే ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని యువ సామ్రాట్ అఖిల్ తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే బన్నీ సరసన అల వైకుంఠపురం లో నటిస్తూ ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: