తెలుగు చిత్ర రంగంలో స్వయంకృషితో పైకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తన కృషి, పట్టుదల, నటనతోనే కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన మగ మహారాజు మెగాస్టార్ చిరంజీవి.  పునాధిరాళ్లతో ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రస్థానం మొదలు పెట్టి మొన్నటి ‘సైరా’ వరకు తన సత్తా చాటుతూ వస్తున్నారు.  60 దాటినా ఇప్పటి యంగ్ హీరోలే మెగాస్టార్ ని ఫాలో అవుతున్నం అనే స్థాయిలో కొనసాగుతున్నారు.  అంతే కాదు మెగాస్టార్ బాటలో వరుసగా స్టార్ హీరోలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  అలా పరిచయం అయిన  వాళ్లలో పవన్ కళ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన, రాజకీయాల్లో అన్నయ్య బాటలో నడుస్తున్నారు. 

 

ఇక అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు.  చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు రికార్డుల మోద మోగించి.. భారీగానే కలెక్షన్లు వసూళ్లు చేసింది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి జీవిత పై  సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రచించిన 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకాన్ని నిన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

 

ఈ పుస్తకావిష్కరణకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రావడం మరింత కోలాహలంగా మారింది.  తాజాగా  'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  నిన్నటి సాయంత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. చిరంజీవిగారి మీద పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. ఈ పుస్తకాన్ని అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు అని రామ్ చరణ్ తెలిపాడు

మరింత సమాచారం తెలుసుకోండి: