‘భరత్ అనే నేను’ మూవీ విడుదలైన తరువాత సుమారు ఏడాదిన్నర కొరటాల చిరంజీవి సినిమా కోసం ఆగవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక టాప్ దర్శకుడుకి విలువైన సంవత్సర కాలం వృథా అయింది అంటే మామూలు విషయం కాదు. అయినా చిరంజీవి ప్రాజెక్ట్ పై ఉన్న మోజుతో కొరటాల ఈ త్యాగం చేసాడు.


ఇలాంటి పరిస్థితులలో కొరటాల చిరంజీవి చెప్పిన సూచనలతో మరొకసారి రాజీ పడవలసి వస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన కథ దేవాలయాల భూముల అన్యాక్రాంతం చుట్టూ తిరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టే ఆశాఖకు సంబంధించిన ఉద్యోగిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తాడు. 


ఇలాంటి పరిస్థితులలో కొరటాల చిరంజీవి పాత్ర కోసం చాల పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాసినట్లు తెలుస్తోంది. ఈ డైలాగ్స్ ఒక స్థాయిని మించి ప్రభుత్వాల అవినీతిని ఎండగడుతూ హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాన్ని హైలెట్ చేసే విధంగా మారినట్లు తెలుస్తోంది. ఈ డైలాగ్స్ స్క్రిప్ట్ అంతా చూసిన తరువాత చిరంజీవి ఈ డైలాగ్స్ ను యథాతధంగా ఈ మూవీలో ఉంచితే ఈ మూవీ భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశమైన హిందూ మత పరిరక్షణ బావ జాలానికి పరోక్షంగా సహకరించేవిగా ఉన్నాయి అంటూ విమర్శలు వస్తాయని చిరంజీవి భయపడుతున్నట్లు టాక్. 


అందువల్ల ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన డైలాగ్స్ లో వివాద రహితంగా మార్పులు చేసి తాను అన్ని రాజకీయ పార్టీల వారికి చెందిన వ్యక్తిగా ఈ మూవీ డైలాగ్స్ లో కొంచెం వివాదాలు తగ్గించమని కోరినట్లు తెలుస్తోంది. దీనితో మరొకసారి కొరటాల చిరంజీవి కోసం తన స్వభావానికి విరుద్ధంగా రాజీ పడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్వతహాగా కమ్యూనిజమ్ భావాలు గల కొరటాల ఈసారి దేవాలయాలకు సంబంధించిన కథను ఎంచుకోవడం ఆశ్చర్యం అయితే చిరంజీవి కోసం పడుతున్న రాజీ మరింత షాకింగ్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: