స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్. మెగా మేనల్లుడిగా అల్లువారి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. మామ మెగాస్టార్ చిరంజీవి ని అమితంగా అభిమానించే అల్లుఅర్జున్ మామ అడుగుజాడల్లోనే నడుస్తూ.. డాన్స్ పై  ఎక్కువ దృష్టి పెట్టి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాడు. ఇక గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత బన్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్య  సినిమా కూడా అల్లు అర్జున్ కి మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్.

 

 

 ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు గంగోత్రి సినిమా తో ఎంటర్ అయిన తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాలు చేసుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ కి కేవలం తెలుగులోనే కాదు.. తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు అన్ని అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటూ వుంటాయి. అయితే అల్లు అర్జున్ మొన్నటికి మొన్న.. అలా వైకుంఠపురములో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

 

 

 కాగా  మామూలుగా అయితే ఎవరైనా హీరోయిన్స్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నప్పుడు దానిపై స్పందించరు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఓ హీరోయిన్ గురించి వస్తున్న వార్తలను చూసి వెంటనే స్పందించాడు. ఇక ఆ హీరోయిన్ చేసిన పనికి ఫిదా అయిపోయాడు అల్లు అర్జున్. తమిళంలో ఓరు అదార్ పేరుతో ఓ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా వారియర్ అప్పట్లో కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం గా మారిపోయింది. ఇక ఈ వీడియో అల్లు అర్జున్ చూసి సోషల్ మీడియా వేదికగా  నీ కన్ను  గీటుకి  ఫిదా అయిపోయాను ఎంతో క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ కూడా పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఏకంగా అల్లుఅర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వెళ్ళి ప్రమోషన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: