తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ అనుష్క క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో మెరిసింది. ఎంతో మంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది ఆరడుగుల అందాల అప్సరస అనుష్క.ఎన్నో  గ్లామరస్ పాత్రలో మెరిసిన ఎంతగానో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు అటు తమిళ సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకొని తన హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 

 ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అనుష్క. ఇప్పటివరకు స్వతంత్ర సమరయోధురాలు రాణి రుద్రమదేవి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొని అదరగొట్టాలన్న... అరుంధతి సినిమాలో పశుపతి అనే నిల్చుని ఎదిరించి ప్రజలందరినీ కాపాడాలన్నా... భాగమతి లో వైవిధ్యమైన నటనతో విమర్శకులను సైతం మెప్పించాలి అన్న.. ఇక సెన్సేషనల్ మూవీ బాహుబలి లో దేవసేనగా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ పౌరుషాన్ని చూపించాలన్న అది అనుష్కకే సాధ్యం అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. ఇక  ఎన్నో  పాత్రలో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.. 

 

 

 అయితే ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో ధైర్యసాహసాలను ప్రదర్శించి ఔరా అనిపించింది అనుష్క. ఎన్నో చారిత్రాత్మక పాత్రలను చేయడంతో పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కూడా అద్భుతంగా నటించింది. అయితే పాత్రల్లో ఎంతో  ధైర్యంగా కనిపించినప్పటికీ అనుష్క స్వతహాగా కాస్త భయస్తురాలట . ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు అంటే అనుష్కకు చచ్చేంత భయమట. ఇక ఎత్తైన ప్రదేశాలను ఎప్పుడైనా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా భయపడుతూనే షూటింగ్ చేస్తూ ఉంటుందట. అంటే సినిమాల్లో ఎంత ధైర్యం గా ఉన్నప్పటికీ ఎన్నో డేరింగ్ పాత్రలు చేసినప్పటికీ అనుష్క దైర్యం వెనుక.. ఎత్తైన ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు అంటే భయం కూడా  ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: