ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా ... యువ హీరోల అందరికీ ఒక ఆదర్శంగా... టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్దన్న లాగా కొనసాగుతున్న చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో గానే  దూసుకుపోతున్నారు. ఎన్నో కష్టాలు పడి అవకాశాల కోసం పడిగాపులు కాసి సొంత టాలెంట్ తో పైకొచ్చిన హీరోగా చిరంజీవి ఇప్పటికే యువ హీరోలకు ఆదర్శమే. అలాంటి చిరంజీవి ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ 150 సినిమాల్లో  తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా మిగిలిపోయిన సినిమాలు ఎన్నో. 

 

 

 తన నటనతో తన డాన్సులతో కామెడీ టైమింగ్ తో అదరగొడుతు ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతి విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. ప్రస్తుతం ఎంత మంది సీనియర్ హీరోల ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే చిరంజీవి కెరియర్ మొదట్లో సాదాసీదా హీరోగా సాగిపోతున్న తరుణంలో ఒక్క సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం మెగాస్టార్ చిరంజీవి పై పడేలా చేసింది. ఒక సినిమా చిరంజీవిని స్టార్ హీరోగా మార్చేస్తుంది. ఆ ఒక్క సినిమా చిరంజీవి లో ని టాలెంట్ ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. అదే ఖైదీ సినిమా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో... బందిపోటు ఖైదీ పాత్రలో నటిస్తారు మెగాస్టార్ చిరంజీవి. 

 

 

 ఇక మొదట పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరినీ చితకబాది పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోతున్న సన్నివేశం నుంచి మొదలయ్యే ఖైదీ సినిమా ఆ తర్వాత ఎన్నో కీలక మలుపులు తిరిగి ఎన్నో యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది . అయితే అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు కోదండరామిరెడ్డి. అలాంటి దర్శకుడు చిరంజీవి లోని యాక్షన్ ఎలిమెంట్స్  బయటకు తీసి ఖైదీ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి చిరంజీవిని స్టార్ హీరోగా మారేలా చేశాడు. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. క్రమక్రమంగా తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా మారిపోయి ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన హీరో మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: