గత రెండు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా థియేటర్లు అన్ని మూసేసిన సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా సినిమా షూటింగ్ లు కూడా పూర్తిగా ఆపేశారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలు లేకపోవడంతో OTT కంటెంట్ పై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

IHG'Run' Trailer, The Next Original Film ...


అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పలు చిత్రాలు ఈ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల నవదీప్ నటించిన మర్డర్ మిస్టరీకి సంబంధించిన ట్రైలర్ " రన్ " మే 29 నుండి ఆహా ఫ్లాట్ ఫాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే దీనిపై స్పీడ్ పెంచిన మేకర్స్ ఆ చిత్ర ట్రైలర్ ని యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

IHG


లక్ష్మీ కాంగ్ చిన్నా తెరకు ఎక్కించిన రన్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియో చూస్తుంటే కథ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా మర్డర్ మిస్టరీ గా ఉంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం లో నవదీప్, వెంకట్, ముక్తార్ ఖాన్, కౌశల్, అమిత్, మనాలి రాథోడ్, మధు, నందన్, భాను శ్రీ మొదలగు వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో నవదీప్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలియజేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: