టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి వేణుశ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ కాగా రెండవది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా. అయితే వీటిలో వకీల్ సాబ్ ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మధ్యలో కరోనా ఎఫెక్ట్ వలన ఎన్నో రోజులుగా మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఈపాటికే విడుదల కావలసిన వకీల్ సాబ్ కూడా మిగతా సినిమాల మాదిరిగా వాయిదా పడడం జరిగింది. 

IHG': S Thaman says composing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUSIC' target='_blank' title='music-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>music</a> for the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> Kalyan ...

పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బాలీవుడ్ మూవీ పింక్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్  శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. కాగా ఈ సినిమాను రాబోయే దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా సినిమాకు సంబంధించి కేవలం మరొక ముప్పై శాతమే షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో, లాక్ డౌన్ ముగిసిన అనంతరం వీలైనంత త్వరగా దానిని ముగించి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారట. 

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత ఇంటర్నల్ వర్క్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే సినిమాని దసరాకు రిలీజ్ చేసే విషయమై ఇప్పటికే బోనీ సహా మిగతా ఇతర యూనిట్ సభ్యులతో చర్చించిన అనంతరం మరొక పది రోజుల తరువాత దిల్ రాజు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండేళ్లు గ్యాప్ అనంతరం వస్తున్న సినిమా కావడంతో ఈ వకీల్ సాబ్ పై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కు ఇది పండుగ వార్తే అని చెప్పకతప్పదు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: