దేశంలో కరోనా ఉపద్రవం వచ్చి వ్యవస్థలన్నింటినీ కుదేలైపోయేలా చేసింది. సామాన్య ప్రజానికానికి కోలుకోలేని దెబ్బ తగిలేలా చేసింది. ముఖ్యంగా వలస కార్మికులు, రోజు వారీ కూలీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పనులు లేక తమ స్వస్థలాలకు వెళుతూ పడ్డ అవస్థలూ తెలిసినవే. వారు పడుతున్న బాధలను తెలుసుకుని ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసాయి. సోనూ సూద్ చేసిన వ్యక్తిగత సాయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ చేస్తున్న చారిటీ కూడా ప్రశంసలు అందుకుంటోంది.

IHG

 

ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలాను శరత్ కుమార్ – ఛాయ కుమార్తె ప్రముఖ తమిళ నటి వరలక్ష్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె చెన్నై రైల్వే స్టేషన్ లో వలస కార్మికులకు ఫుడ్ ప్యాకెట్స్, బ్రెడ్ అందజేశారు. అరగంటలో మొత్తం 20 కంపార్ట్ మెంట్స్ లో దాదాపు 1600 మందికి ఆహారం అందించారు. ముగ్గురు వాలంటీర్లతో కలిసి ఆమె ఆహారం అందించారు. ఈ రైళ్లు తిరిగినన్ని రోజులు వారు ఇలా సేవ చేశారని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా వారు ఆహారం అందిస్తున్న వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.

IHG

 

వలస కార్మికుల కష్టాలు చూసిన ఎవరికైనా మనసుల చలించకమానదు. ఎంతోమంది కాలినడకన వెళ్లారు. అలసిపోయి రైల్వే ట్రాక్ పై నిద్రించి రైలు దూసుకుపోయి చనిపోయారు కొందరు. రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందారు మరికొందరు. రవాణా సౌకర్యం లేనప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినా వారి సమస్యలు తీరటం లేదు. కరోనా వచ్చి కొత్త సమస్యలు సృష్టించి మానవాళి మీద ప్రతాపం చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: