రానా పెళ్లి విషయంలో టాలీవుడ్ జనాలు ఏ వార్త వచినా సరే ఆసక్తికరంగా చదువుతున్నారు. అతని పెళ్లి ఏమో గాని జనాలకు మాత్రం పైకి చెప్పలేని విధంగా ఒక పండగ వాతావరణం ఉంది. ఇప్పుడు అతడి పెళ్లి ఇటు సినిమా సర్కిల్స్‌లో మాత్రమే కాకుండా... అటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ పెళ్లిని రానా ముంబై లో చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పెళ్లికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుందని కూడా తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో పెళ్లి హడావిడిగా చేసుకునేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ ఇష్టపడడం లేదట. ఆగస్ట్ లో రానా ముంబై లో పెళ్లి చేసుకుని అటు నుంచి ఆటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే రానా ముంబై లో ఒక ఫ్లాట్ కూడా తన భార్యతో కలిసి ఉండటానికి కొన్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక రానా తండ్రి సురేష్ బాబు సైతం ఆగస్టు 8న పెళ్లి జరుగుతుందని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి కోసం రానా ఇప్పటికే కొందరు ప్రముఖులను ఆహ్వానించాడు అని మీడియా కు ఏ సమాచారం మాత్రం ఇవ్వడం లేదు అని అంటున్నారు. ఇక రానా కు కాబోయే భార్య మిహీకా బజాజ్ కుటుంబ సభ్యులు సైతం ముంబైలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి