అడివి శేష్ బహుశా ఇతని గురించి అందరికి తెలీకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇతను తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన వజ్రం. తన నటనతో మంచి మంచి సినిమా లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు పొందాడు. ఇతను ఒక అందమైన నటుడు మాత్రమే కాదు. ఇతనొక రచయిత. ఒక కథ ను బ్రహ్మాండం గా మలిచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే ప్రతిభ గల నటుడు. అందుకు ఉదాహరణలు ఇతను చేస్తున్న సినిమాలు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆశ్చర్య పోయేలా కథలు సిద్ధం చేసుకుంటాడు ఈ నటుడు.

పంజా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు అడివి శేష్. అందులో నెగటివ్ రోల్ పోషించిన అందరికి గుర్తుండిపోయే రోల్. తర్వాత హీరో గా ఒకటో అరో చేసిన మూవీస్ జనాలను ఆకట్టుకోలేకపోయాయి. తర్వాత రన్ రాజా రన్ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. ఆ క్యారెక్టర్ కి చాలా మంచి పేరు వచ్చింది. చూడటానికి చాలా అందంగా వుండే ఈ హీరో ఇప్పుడున్న హీరోస్ కి పోటీ గా నిలబడి మంచి మంచి సినిమా లు చేస్తున్నాడు. గత కొంత కాలం నుండి చేస్తున్న మూవీస్ కి క్రిటిక్స్ ప్రశంస లతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాడు. మంచి సినిమా లు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఉదాహరణ ఈయన ఇప్పుడు చేస్తున్న మూవీస్. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠం తో కట్టి పడేసేలా మూవీస్ తీస్తాడు ఈ హీరో. క్షణం, గూఢచారి, ఎవరు ఈ సినిమాలే ఇతని నటనకి, ప్రతిభ కి గుర్తింపు, నిదర్శనం. ఎలాంటి బూతు సినిమాలు, రోత లవ్ స్టోరీ లు తీయకుండా మంచి మంచి మూవీస్ ఎంచుకుంటూ ఇప్పుడున్న హీరోస్ కి ఈయన ఇన్స్పిరేషన్ గా తయారు అవుతున్నారు. ఇతని టాలెంట్ గుర్తించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతనితో ఇప్పుడు ఒక మంచి సినిమా తీస్తున్నారు. ఆ మూవీ నే మేయర్. దీనిని మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇది ఒక బయోపిక్. దివంగత ఆర్మీ మేయర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. అడివి శేష్ ఇక ఇలా నే తన టాలెంట్ ని వాడితే భవిష్యత్తు లో కచ్చితంగా ఒక గొప్ప స్టార్ హీరో అవుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: