ముందుగా అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని పాత్రని వెండి తెరపై పోషించిన నటులు గురించి తెలుసుకుందాం ఇప్పుడు.

అక్షయ్ కుమార్:  అక్షయ్ కుమార్ 2012 వ సంత్సరంలో ఓహ్ మై గాడ్ అనే చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించాడు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఒక  నాస్తికుడు  చుట్టూ తిరుగుతుంది, అతను తన పురాతన దుకాణంలో నష్టాన్ని చూసిన తరువాత దేవుడిని కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అక్షయ్ కుమార్ పోషించిన ఈ పాత్రకు గాను అతనికి మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది ఈ చిత్రం.

ఎన్.టి.రామారావు: తెలుగు దివంగత నటులు  ఎన్.టి.రామారావు గారు ఏకంగా 17 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. ఇది ఇప్పటివరకు ఏ ఇతర భారతీయ నటుడు అందుకోలేనటువంటి ఘనత. ఈ చిత్రాలలో కొన్ని శ్రీ కృష్ణార్జున యుధం (1962), తమిళ చిత్రం కర్ణన్ (1964) మరియు దానా వీర సూర కర్ణ (1977) ప్రేక్షకులకు ఎన్నటికీ గుర్తుండిపోతాయి. అసలు కృష్ణుడుకి మానవ రూపం ఉంటే రామారావు లాగానే ఉంటారేమో అనేంతలా మెప్పించారు.

పవన్ కళ్యాణ్: 2014 వ సంవత్సరంలో వచ్చిన  గోపాల గోపాల సినిమా హిందీ సినిమా ఓహ్ మై గాడ్ రీమేక్ ఇది.  తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రను పోషించాడు. ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందు పవన్ సంశయించినట్లు వార్తలు వచ్చాయి కాని  చివరికి ఆయన ఈ ప్రాజెక్ట్ చేపట్టి అంగీకరించడానికి 10 రోజులు పట్టింది అట. ఈ చిత్రంలో అతని స్క్రీన్ సమయం 25 నిమిషాలు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే థియేటర్ లో అభిమానుల చేత ఈలలు వేయించింది.

జెమిని గణేశన్: తమిళ దివంగత నటులు జెమిని గణేషన్ 1948 వ సంవత్సరంలో తన చక్రధారి చిత్రంలో శ్రీకృష్ణునిగా నటించారు. ఈయన నటన గురించి పెద్దగా చెప్పనవసరం     లేదు. నటన లో విశ్వరూపం చూపిస్తారు. ఇక ఈ చిత్రం అప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

పృథ్వీరాజ్: మలయాళ చిత్ర నిర్మాత హరిహరన్ దర్శకత్వం వహించిన శ్యామంతకం చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ కథ మహాభారతం యొక్క ఉప కథ ఆధారంగా రూపొందించబడింది. కృష్ణుని పాత్ర  ఇంతకుముందు కొన్ని భారతీయ చిత్రాలలో పోషించినప్పటికిని , ఆయన్ని పూర్తి స్థాయిలో హీరోగా చిత్రీకరించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా లో పృథ్వీ రాజ్ కృష్ణుడు పాత్ర లో  యోధుడు, ప్రేమికుడు మరియు తత్వవేత్తగా కనిపిస్తాడు. ఈ చిత్రం 2016 వ సంత్సరంలో విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: