దర్శక రత్న దాసరి ఈ మధ్య ఏదైనా సినిమా ఫంక్షన్ కు వస్తే చాలు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ లో సంచలనం సృస్తిస్తున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాత కె. రాఘవ సన్మాన సభలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ ‘దురదృష్ట వశాత్తూ మన చరిత్ర మరుగున పడిపోతోంది. ఎన్టీఆర్ అంటే ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ అనుకునే పరిస్థితి దాపురించింది' అని వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతూ దాసరి ఈ వ్యాఖ్యలు చేయడంపై అసలు కారణం ఏమిటో ఆ సభకు వచ్చిన వారికీ ఎవరికి అర్ధం కాలేదు. గతంలో జూనియర్ కు దాసరికి విభేదాలు వచ్చిన నేపధ్యం కుడా లేకపోవడంతో కారణం లేకుండా దాసరి అకారణంగా ఇలా మాట్లాడతారా అంటూ దాసరి మాటలకు అర్ధాలు వెదుకుతున్నారు విశ్లేషకులు. తెలుగు దేశం పార్టీ వ్యవహారాల కారణంగా ఓ వైపు నందమూరి ఫ్యామిలీ విబేధాలు ఓపెన్ సీక్రెట్ గా మారిన  పరిస్థితులలో దాసరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 'తాత మనవడు' విడుదలై 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వేయి పున్నములు దర్శించిన ప్రముఖ చిత్ర నిర్మాత కె. రాఘవ ను 'యువకళావాహిని' సన్మానించిన సందర్భంలో దాసరి ప్రస్తుతం నిర్మాతలు తమ ఉనికిని కోల్పోయి క్యాషియర్లు, ఫైనాన్షియర్లు, మీడియేటర్లుగా అవతారం ఎత్తి తమ గౌరవాన్ని కోల్పోతున్నారని తన ఆవేదన వ్యక్తం చేసారు దాసరి..  

మరింత సమాచారం తెలుసుకోండి: