వెండితెర మన్మధుడు నాగార్జున కొడుకులు హీరోలుగా మారినా ఇంకా తన గ్లామర్ తో యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. నాగ్ ప్రస్తుతం తనకుమారుడు చైతన్య, తన తండ్రి అక్కినేనితో కలిసి నటించిన ‘మనం’ సినిమా గురించి రోజుకు ఒక ఆశక్తికర విషయం బయటకు వస్తోంది. ఈనెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఆడియో రిలీజ్ హంగామా లేకుండానే నాగార్జున తెలివిగా ఒక్కోక్క పాటను నెట్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్ట కుండానే ట్రైలర్.. టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒక వారం క్రితం ఈ సినిమాలోని ‘పీయో పీయో’ పాటను ఫోటోలతో వెబ్ మీడియాలో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ పాటలోని ఓ నిమిషం వీడియోను రిలీజ్ చేయగా దీనికి విశేషం స్పందన వస్తోంది. పబ్బులో సాగే ఈ పాటలో నాగ్ తన కొడుకు చైతూతో కలిసి మందుకొట్టి స్టెప్పు లేయడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. ఈ పాటలో చైతూ నిజంగానే నురగలుకక్కే బీరును నాగార్జునతో బలవంతంగా తాగిస్తాడట. సహజత్వం కోసం షూటింగ్ సమయంలో నిజమైన బీరు, మందు ఈ సినిమాలో వాడరట. తన పిల్లలతో తండ్రిగా కాకుండా స్నేహితుడిగా కలిసిమెలిసి పోతాను అని చెప్పే నాగార్జున ఈ సినిమాలో మందు కొట్టి వేసే చిందులు చూడాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యాక చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: